తెలంగాణలో దగాకోరు పాలన..!
– అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్న సీఎం
– పాలమూరు ప్రారంభం ఎన్నికల కోసమే
– స్వరాష్ట్రంలో సమ్మెల పర్వం విడ్డూరం
– డ్రగ్స్, మద్యంతో ముంచేస్తున్న సర్కారు
– బీఆర్ఎస్, బీజేపీలని దొంగాటలు
– ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ పోరు
– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ రాష్ట్రంలో దగాకోరు పాలన కొనసాగుతోందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనకు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి, ఏఎన్ఎం, హోంగార్డులు, స్వర్వ శిక్ష అభియాన్, డీఎస్సీ నిరుద్యోగులు సమ్మెలు చేపట్టడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన దిగజారిపోతోందని ధ్వజమెత్తారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకుండా సీఎం కేసీఆర్ ప్రారంభించడం ఎన్నికల సంట్లో భాగమే అన్నారు. ముంపు ప్రాంతాలు, భూనిర్వహసితులకు పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం పట్ల మండిపడ్డారు. కేసీఆర్ తన ఫాంహౌస్ కు నీరు పారాలనే రూ. 19వేల 80 కోట్లతో కాళేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయించుకున్నారని అన్నారు. అభివృద్ధిలో ఉత్తర తెలంగాణపైనే దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో పాలమూరు రంగారెడ్డికి ఎందుకు నిధులు కేటాయించలేదని, పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులను, ప్రతిపక్షాలను నిర్బంధించి పాలమూరును ప్రారంభించడాన్ని ఖండించారు. పోలీసు రాజ్యంతో కలిసి సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను జర్నలిస్టులు, అధికారులు ఫోన్ లను పెగాసిస్ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. పలు విభాగాలను రెగ్యులరైజ్ చేసిన కేసీఆర్ అంగన్ వాడి, సర్వశిక్ష అభియాన్ లంచాలు ఇవ్వడం లేదని వారిని రెగ్యులరైజ్ చేయడం చేయడం లేదని విమర్శించారు. ధనార్జనే ధ్యేయంగా సర్కారు అక్రమాలకు పాల్పడితోందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఆక్రమాలు జరిగాయన్నారు. గ్రూప్-1 టాపర్ వివరాలను చెబితే అక్రమాలు బయటపడాయన్నారు. మరి ఎందుకు చెప్పడంలేదో అర్థం చేసుకోవచ్చన్నారు. కేటీఆర్, కవిత, మంత్రి హరీష్ రావుల కాల్ రికార్డులు బయట పెడితే ఆక్రమాలు బయటపడతాయన్నారు. దీంతో పాటు తెలంగాణలో ఫేక్ యూనివర్సీటీలతో కోట్లాది రూపాయిలు దండుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, ఫేక్ యూనివర్సిటీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ధరణి పోర్టల్ ద్వారా అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణలో డ్రగ్స్, మద్యం విధానంతో తెలంగాణను ఉడ్తా పంజాబ్ సినిమాలాగా మార్చేశారని అన్నారు. రూ.8 వేల కోట్లు రావాల్సిన ఆధాయం ఈ యేడాది రూ. 48 వేల కోట్ల ఆధాయం వచ్చిందంటే మద్యం విధానం వల్లే అని అన్నారు. విద్య అందించడమంటే మద్యం అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ దొంగాటలు ఆడుతున్నారని అన్నారు. కేంద్రంలో ఆరాచకాలను ప్రశ్నించలేని కాంగ్రెస్ పార్టీ ఉద్దరించేది ఏమి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తెలంగాణ నిర్బంధ పాలన అంతం కోసం పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుందని, తాను మాత్రం ఆంధ్రప్రదేశ్, సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
మరోవైపు తాండూరులో పోలీసులను తిట్టినందుకే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కందిబోర్డు హామి మరించి డ్రగ్ తాండూరుగా మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ స్టేట్ కోఆర్డినేటర్ ప్రభాకర్, శ్రీనివాస్, తాండూరు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ సత్యమూర్తి. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

