అంగ‌న్‌వాడీల సంబురం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

అంగ‌న్‌వాడీల సంబురం
– సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: శిశు సంక్షేమంతో పాటు మ‌హిళ ఆరోగ్య ర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నఅంగ‌న్‌వాడీ టీచ‌ర్లు తాండూరులో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. శనివారం తాండూరు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలుతో పాటు ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ

అంగ‌న్‌వాడి టీచ‌ర్ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు అంగ‌న్‌వాడీల‌ను విస్మ‌రిస్తే తెలంగాణ ప్ర‌భుత్వ హ‌యాంలో సీఎం కేసీఆర్ అంగ‌న్‌వాడీల‌కు మూడుసార్లు వేత‌నాలు పెంచింద‌న్నారు. మ‌రోవైపు అంగ‌న్‌వాడీలు మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా స‌ముచిత స్థానం క‌ల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి రుణ‌ప‌డి ఉంటామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు అఫ్పూ(న‌యూం), ఉర్దూ ఘ‌ర్ చైర్మ‌న్ అబ్దుల్ ర‌జాక్, న్యాయ‌వాది గోపాల్, యువ‌నాయ‌కులు సంతోష్‌గౌడ్‌, ఇంతియాజ్, సంజీవ‌రావు, బాలకృష్ణరెడ్డి, శ్రీశైలం, అంగ‌న్ టీచ‌ర్లు, ప్రజా బందు టీమ్ వారు తదితరులు పాల్గొన్నారు.