కాంగ్రెస్ చైర్మన్ నిర్ణయం అప్పుడే..!
– తాండూరు అభివృద్ధికి రూ. 1000 కోట్లు తెస్తాం
– మళ్లీ మున్సిపల్ జంగీల్ రాజ్ను రానివ్వం
– బల్దియాపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు డిసైడ్ అయ్యిందని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ డీఎన్ఏ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాలు గెలవడం ఖాయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో, తాండూరు ఎమ్మెల్యేగా మున్సిపల్ అభివృద్ధికి రూ. 1000 కోట్లు తీసుకవస్తామన్నారు. వచ్చే రెండేళ్ల(2028)లో సీఎం రేవంత్ రెడ్డికి తీసుకవచ్చి తాండూరు రూపురేఖలు మారుస్తామని అన్నారు. బీఆర్ఎస్ హాయంలో ఐదేళ్ల పాటు కుర్చీ కోసం, ఆదిపత్యం కోసం కోట్లాడి తాండూరును భష్టు పట్టించారని అన్నారు.

మళ్లీ అలాంటి జంగీల్ రాజ్ వ్యవస్థను రానివ్వబోమని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 25 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుంటుందని అన్నారు. మతిభ్రమించి అవాకులు.. చవాకులు పేలుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం, మంత్రులు, ఇంచార్జ్ మంత్రులే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులకు పార్టీ బీపారాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ లైబ్రరీ చైర్మన్ మురళీ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు అఫ్పూ (నయూం), బంటు మల్లప్ప, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, హబీబ్ లాల, సాజిద్ అలీ, కార్యకర్తలు తదితరులు-ఉన్నారు.

ఇదికూడా చదవండి…

