నాపరాతి సమస్యలపై ఎమ్మల్యే చొరవ
– అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం
– హర్షం వ్యక్తం చేసిన స్టోన్, క్వారీ ఓనర్స్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో నాపరాతి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూడపం పట్ల స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అఫ్పూ (నయూం), మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్ లు సంతోషం వ్యక్తం చేశారు.

సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రాంత నాపరాతి వ్యాపారుల ఇబ్బందులు, సమస్యలను ప్రస్తావించారు. ఎన్నో కుటుంబాలు నాపరాతి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో రాయల్టీ విధానంలో తేడాలు ఉండడంతో అభివృద్ధి చెందడం లేదని ఎమ్మెల్యే స్పీకర్ దృష్టికి తీసుకవచ్చారు.

మైనింగ్ లీజుల విషయంలో కూడా మాట్లాడడం పట్ల అప్పూ, అబ్దుల్ రవూఫ్ లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాండూరులోని పారిశ్రామిక వాడను కాపాడేందుకు మనోహర్ రెడ్డి చొరవ చూపించడం అభినందనీయమన్నారు. ప్రతి ప్రభుత్వ భవనంలో తాండూరు నాపరాతిని వినియోగించాలని అసెంబ్లీ దృష్టికి తీసుకవెళ్లడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టితో తాండూరు నాపరాతి పరిశ్రమలు పురోగతిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

