రాజ్యాంగం మార్చాల‌న‌డం దుర్మార్గం

తాండూరు వికారాబాద్

రాజ్యాంగం మార్చాల‌న‌డం దుర్మార్గం
– సీఎం కేసీఆర్ వాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి
– సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, స్వేరోస్ ద‌ళిత సంఘాల నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భార‌త ర‌త్న డా.బీఆర్. అంబేద్క‌ర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాల‌ని సీఎం కేసీఆర్ వాఖ్య‌ల‌ను చేయ‌డం దుర్మార్గ‌మ‌ని, వాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, స్వేరోస్ ద‌ళిత సంఘాలు డిమాండ్ చేశారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం ముందు ఆయా సంఘాల నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంగా సీఎం ఓ వైపు బీజేపీ పై గంభీరంగా మాట్లాడుతూనే మరో వైపు ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలను అమలు చేసే విధంగా ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్య దేశం, గొప్ప రాజ్యాంగం మనది అని గతములో వ్యాఖ్యలు చేసి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకుంటే ఏ పాలకులు తెలంగాణ ఇవ్వలేకపోయే వాళ్ళని అని నాడు ఘంటా పధంగా చెప్పిన సీఎం నేడు నాలుక తాటి మట్టలాగా మారి ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని ప్రజలు ఖండించాలన్నారు. రాజ్యాంగంలోని ఏ ఏ అంశాలు ప్రస్తుతం పనికి రావో తేల్చాలన్నారు. పాత రాజ్యాంగం కోసం పరితపించే వారి ఆధ్యాత్మిక దైవం చినజీయర్ స్వామి కులాలు ఇలాగే ఉండాలి. ఏ కులం పని ఆ కులం చేయాలి అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందేనని, ఆయన ఆదేశాల మేరకే సీఎం మాట్లాడినట్లు విధితమవుతుందన్నారు. పాత రాజ్యాంగం అంటే మనుస్మృతి ఇది చాతుర్వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ దోపిడీ అణిచివేత నిరంతరంగా కొనసాగాలని ఉద్దేశ్య పూర్వక వ్యాఖ్యలవలె ఉన్నాయన్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించు కోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ తరం కాదని వ్యాఖ్యానించారని కానీ వారి అసలు ఉద్దేశ్యం రాజ్యాంగాన్ని రద్దు చేయడమేనని చెప్పారు. కేసీఆర్ మాటలన్నీ మేకపోతు గాంబిర్యమే కానీ మధపుటేనుగు వలే బీజేపీ రాజ్యాoగాన్ని నులిపివేస్తుందన్నారు. బీజేపీ విధానాలతో రాజ్యాంగానికి మరింత ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, స్వేరోస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు అరుణ్ రాజ్, జనార్ధన్, దళిత ప్రజాసంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చంద్రయ్య, కిష్టప్ప, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాష్ నర్సింలు, బాలు తదితరులు పాల్గొన్నారు.