సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి
– రాజ్యాంగాన్నిమార్చాలన్నందుకు క్షమాపణ చెప్పాలి
– కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ ధారాసింగ్, జిల్లా అధ్యక్షురాలు శోభారాణి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: భారత రాజ్యాంగాన్నిమార్చాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యులు, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణిలు డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ధారాసింగ్, శోభారాణిలతో పాటు రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత న్యాయవాది ఎల్లారెడ్డి, వార్డు సభ్యులు డివై. అరవింద్, ఫయాజ్, మల్లేశం, జై భీమ్ యువజన సంఘం సభ్యులు రఘు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రత్న బీఆర్ అంబేద్కర్ దేశంలో అందరికి అమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. అయన రచించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని అన్నారు. అలాంటి రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేసీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ఇక్బాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీరేందర్, సాయిబాబా, రాజు, వెంకయ్య, రమేష్, నాగమణి, లక్ష్మీ, బచ్చమ్మ, సాయమ్మ, వెంకటమ్మ, రత్నమ్మ, యశోద, జై భీమ్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

