ఫ్లాస్టిక్ వినియోగ‌దారులు జాగ్ర‌త్త‌..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఫ్లాస్టిక్ వినియోగ‌దారులు జాగ్ర‌త్త‌..!
– తాండూరులో మ‌ళ్లీ మొద‌లైన దాడులు
– వినియోగ‌దారులకు హెచ్చ‌రిక‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిషేధిత ప్లాస్టిక్ అమ్మేవారు.. వినియోగించే వారు ఇక జాగ్ర‌త్తగా ఉండాలి. ప‌ర్యావ‌ర‌ణానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు తాండూరు మున్సిప‌ల్ అధికారులు మ‌ళ్లీ దాడుల‌కు సిద్ద‌మ‌య్యారు. గురువారం ప‌ట్ట‌ణంలోని బ‌స‌వ‌ణ్ణ క‌ట్ట‌, కూర‌గాయ‌ల మార్కెట్, ప‌రిస‌ర ప్రాంతాల‌లో ప్ర‌త్యేక బృందంతో క‌లిసి త‌నిఖీలు నిర్వ‌హించారు. మున్సిప‌ల్ శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎన్విరాల్ మెంట్ ఇంజ‌నీర్ ప్ర‌వీణ్ కుమార్ బృందం ప్లాస్టిక్‌పై త‌నిఖీలు చేశారు. ప్లాస్టిక్ వ్యాపారులకు, చిరు వ్యాపారుల‌కు నిషేధిత ప్లాస్టివ్ వినియోగించొద్ద‌ని హెచ్చ‌రించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వినియోగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ప్ర‌జ‌లు కూడ ప్లాస్టిక్‌ను వాడ‌రాద‌ని సూచించారు. వివిధ అవ‌స‌రాల కోసం బ‌ట్ట సంచుల‌ను, ఇత‌ర బ్యాగుల‌ను వినియోగించుకోవాల‌న్నారు. ప్లాస్టిక్ విక్ర‌యిస్తూ గాని, వినియోగిస్తూ గాని ప‌ట్టుబ‌డితే జ‌రిమాన‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

స్వచ్ఛ మ‌రుగుదొడ్ల ప‌రిశీల‌న
మ‌రోవైపు తాండూరు ప‌ట్ట‌ణంలోని స్వ‌చ్ఛ మ‌రుగుదొడ్ల‌ను శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్ ప‌రిశీలించారు. మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని నిర్వ‌హ‌కుల‌ను ఆదేశించారు.
నిర్ల‌క్ష్యంగా ఉంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ సిబ్బంది వెంక‌టేష్, జవాన్లు భూపతి, T శ్రీనివాస్, బాలూ, వీరన్న, CH అశోక్, వెంకటేష్, గౌతాపూర్ శ్రీనివాస్ యాదవ్, రమేష్ త‌దిత‌రులు ఉన్నారు.