నమ్మకాన్ని వమ్ము చేయను…!
-వచ్చే ఆరునెలల్లో రోడ్ల అభివృద్ధి చేస్తా
– దుమ్ము లేవకుండా రోడ్లపై నీళ్లు చల్లించే ఏర్పాటు
-బైపాస్, ఇండస్ట్రీయల్స్ పార్కుల పూర్తికి కృషి
-తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రీలే దీక్షలను శాంతింపజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే ఆరుమాసాల్లో రోడ్ల అభివృద్ధి, దుమ్ము దూళీ నియంత్రణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరులో రోడ్లు, కాలుష్యం. మెడికల్ కళాశాల డిమాండ్లతో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూరు బంద్, రీలే దీక్షలతో ఆందోళన చేపట్టారు. ఇందిరా చౌరస్తాలో అందోళన కారులతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు.
తాండూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ఇందుకోసం నిధులను.. తీసుకరావడం జరిగిందని గుర్తు చేశారు. వచ్చే వానాకాలంలోపు రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అప్పటి వరకు రోడ్లపై దుమ్ము దూళీ లేవకుండా మున్సిపల్ నుంచి నీళ్లు చల్లే ఏర్పాట్లు చేస్తామని, ప్రతి రోజూ మూడు సార్లు నీళ్లు చల్లే ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో సొంత నిధులతో పాటు రిజ్వాన్ అనే వ్యక్తితో కలిసి రోడ్ల మరమ్మత్తులను చేపట్టడం జరిగిందన్నారు. కాలుష్య నియంత్రణ కోసం అటకెక్కిన బైపాస్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని గుర్తుచేశారు. అదేవిధంగా ఇండస్ట్రీయల్ పార్కులను పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో కాగ్నా వంతెన తాగితే ఇబ్బందులు ఎదరయ్యేవని, గత వర్షాకాలంలో కాగ్నా వంతెన తాగితే టీఆర్ఎస్ నాయకుల సహాకారంతో 24 గంటల్లో. మరమ్మత్తులు పూర్తిచేయించామని అన్నారు. పెండింగ్ లో ఉన్న కాగ్నా కొత్త వంతెనను పూర్తి చేయించడం జరిగిందన్నారు. తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తాండూరులో అభివృద్ధి పనులు వచ్చే ఎన్నికల వరకు జరగవు అనే కొందరు చేసే దుష్ప్రచారాలను నమ్ముద్దని సూచించారు. వచ్చే ఆరు మాసాల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తాండూరు ప్రజలు: ‘ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, స్వచ్చంద సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు ఉన్నారు.
