సెగలు మోసుకోస్తున్న వేసవి..!
– ఈ యేడాది భారీగా పెరగున్న ఉష్ణోగ్రతలు
– జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు
దర్శిని ఆరోగ్యం : కొన్ని రోజుల్లోనే శీతాకాలం ముగుస్తుంది. ఆ తరువాత వచ్చేది వేసేవే. వేడి పుట్టించే వేసవి అంటే అందరు భయాందోళన చెందుతారు. అనుకున్నట్లుగానే ఈ యేడాది వేసవిలో సూరీడూ సెగలు కక్కించడం ఖాయమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
గడిచిన రెండేళ్లుగా కరోనా విలయతాండవం చేయడంతో లాక్‌డౌన్‌లోనే సమ్మర్ మూడు నెలలు గడిచిపోయింది. స్కూళ్ళు, కళాశాలలు మూతబడగా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్ణీత వేళల్లోనే పనిచేశాయి. వర్క్ ఫ్రంహోం అమల్లోకి రావడంతో అత్యధికశాతం మంది ఉద్యోగులు ఎంచక్కా ఇంటిపట్టునే ఉండి కూల్..కూల్‌గా ఆఫీసు కార్యకలాపాలు చక్కబె ట్టేశారు. అయితే రానున్న 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం 35-36 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు.. త్వరలోనే 38-39 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపింది. పలు చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జాగ్రత్తలు అవసరం..
వేసవి కాలంలో వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండ కాలంలో వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండటం మంచిదని చెబుతున్నారు.
ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయం 10 గంటలలోపే పూర్తి చేసుకోవాలని, లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. దీంతో పాటు ఎండ కాలంలో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగకరమంటున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఇబ్బందులు తల్తెతితే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వేసవిలో మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

