విద్యార్థులకు చేయూతనందిస్తాం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు చేయూతనందిస్తాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
-ఎంసెట్ అభ్యర్థులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థుల ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు తమ వంతు చేయూతనందించేందుకు సిద్దంగా ఉంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ లో పాల్గొంటున్న విద్యార్థులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సహాకారంతో ఉచితంగా స్టడీ మెటిరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు స్టడీ మెటిరియల్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు తమ వంతు చేయూత ఎల్లప్పుడు అందిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు సహాకారం ఉంటుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. తాండూరుకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, బాసిత్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు మసూద్, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు బిడ్కర్ రఘు తదితరులు పాల్గొన్నారు.