మహిళలకే పెద్ద‌పీట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళలకే పెద్ద‌పీట..!
– సంక్షేమం, అభివృద్ధిని అందిపుచ్చుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-తాండూరులో అట్టహాసంగా మహిళ దినోత్సవ సంబరాలు
– బహుతులు అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మహిళల సంక్షేమం, అభివృద్ధి, భ‌ద్ర‌త‌కే తెలంగాణ ప్ర‌భుత్వం పెద్దపీట వేస్తుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళ బంధు సంబరాలను తాండూరులో అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని ఎంపీటీ హాల్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళ బంధు, అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా అంగన్వాడి టీచ‌ర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగలకు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు పలు పోటీలతో సంబరాలు ఉత్సహాంగా జరిగాయి. మహిళ కొలాటాలు, బతుకమ్మ ఆట పాటలు, వివిధ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా పలువురు మహిళలకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఆద‌ర్శ‌నీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. భద్రతకు కూడ ప్రాధాన్యమిస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముఖారక్, ఒంటరి మహిళకు ఆసరా, అమ్మఒడి, కేసీఆర్ కిట్, షీటీం వంటి పథకాలను మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు.
ఈ పథకాలతో పాటు సామాన్య మహిళలు అభివృద్ధి చెందాలన్నారు. మరోవైపు ఆశ వర్కర్లకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పల్లెళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ప్రధాన కార్యద‌ర్శి ఎం.శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, టీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు సౌజన్య, ప్రధాన కార్యదర్శి గాజుల మాధవి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.