బీజేపీకి ఎదురే లేదు..!
– తెలంగాణలో కూడ బీజేపీ గద్దెనెక్కడం ఖాయం
– నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై హర్షం
– బీజేపీ తాండూరు ఇంచార్జ్ కన్వినర్ నరుకుల నరేందర్ గౌడ్
తాండూరు, దర్శని ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ, మోడి ఆదర్శవంత మైన పాలనతో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయ ఢంకా మోగించిందని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ కన్వినర్ నరుకుల నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయాలు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 70 సంవత్సరాలలో రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్న యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండడం అభినందనీయమన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. అందకునే దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ బీజేపీకి ఎదురు ఉండదని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే పోతుందని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా తాండూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయమని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.


