గోరెప్ప కుటుంబానికి బీవీజీ ఫౌండేషన్ చేయూత
– రూ. 3వేల ఆర్థిక సహాయం అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కుమారుడికి ఈత నేర్పించేందుకు బావిలో దూకి మృత్యువాత పడిన గోరెప్ప కుటుంబానికి తాండూరు బీవీజీ ఫౌండేషన్ చేయూతనందించింది. గ్రామ మాజీ ఎంపీటీసీ నాగప్ప ద్వారా విషయం తెలుసుకున్న బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్లు కుటుంబానికి రూ. 3వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం నాగప్ప కుటుంబ సభ్యులకు నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరుపున కుటుంబానికి తమవంతు సహాకారం అందిస్తామన్నారు. మరోవైపు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బీవీజీ ఫౌండేషన్ సభ్యులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

