జులైలో ఎంసెట్, ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్..
– నోటిఫికేషన్‌లో స్పష్టం చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎంసెట్-2022, ఈ సెట్-2022 నోటిఫికేషన్ తేదీలను విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు విషయంలో జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.800 గా నిర్దారించినట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.400లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లను నిర్దారించారు. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ జరుగనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకిగాను డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ సెట్ ఎంట్రెన్స్ కోసం జులై 13 న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

