కమలంలో.. కల్లోలం..!
– పెరిగిపోయిన గ్రూపు రాజకీయాలు
– ఎంపీ వర్గం, జిల్లా అధ్యక్షుడి వర్గంగా విడిపోయిన నేతలు
– హీట్ ఎక్కిస్తున్న ఇరువర్గాల డిమాండ్‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కమలం పార్టీలో కల్లోలం రేగోతోంది. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులోనే గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని అనేంతలా జరుగుతున్నాయి.

ఈ పరిణామాలను రాష్ట్ర నేతలు చక్కదిద్దేందుకు యత్నించినా ఇప్పట్లో సర్దుకుపోలేని స్థాయికి వర్గపోరు చేరింది. వికారాబాద్ జిల్లాలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైపు ఓ వర్గం, జిల్లా అధ్యక్షులు డా.రాజశేఖర్ రెడ్డి వర్గం మరోవైపు ఈ గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కొండా వైపు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమష్ కుమార్, అతని అనుచర గణం ఉన్నారు. జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వైపు జిల్లా ఎన్నికల ఇంచార్జ్ బాలేశ్వర్ గుప్త, సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్‌లు ఉన్నారు.

గత కొన్ని రోజులుగా ఈ రెండు వర్గాలు పార్టీ కార్యక్రమాలు, దర్నాలు, ఆందోళనలు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని రాష్ట్ర క్రమశిక్షణ కమిటి వరకు ఫిర్యాదులుగా వెళ్లాయి. క్రమశి క్షణా కమిటీ ప్రతినిధులు ధర్మరావు నేతృ త్వంలో రెండు వర్గాల వారి వాదనలు వింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని మర్చాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్, బీజేపీ జిల్లా మాజీ అధ్య క్షుడు మాధవరెడ్డి తదితరులు పార్టీ పెద్దల వద్ద పట్టుబ ట్టారు. మరోవైపు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవ హరిస్తున్నారని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, జిల్లా అధ్యక్షుడిని సైతం అవమానప రుస్తున్నారని బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి బాలేశ్వరుప్తా, నాయకులు వాధిస్తున్నారు. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రూపు రాజకీయాలు బయటకు రావడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాలను రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్రావు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కమలం పార్టీలో కల్లోలం కొనసాగుతోంది. ఈ వర్గ రాజకీయాలు ఎంత వరకు వెళతాయో అని చర్చనీయాంశంగా మారాయి.

ఇదికూడా చదవండి…

