గ‌జ‌ల‌ప్ప‌కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

గ‌జ‌ల‌ప్ప‌కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌ర్గ క‌న్విన‌ర్ రాజ్ కుమార్ తండ్రి స్వ‌ర్గీయ కందుకూరి గజ‌ల‌ప్ప‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నివాళులు అర్పించారు. మంగ‌ళవారం ప‌ట్ట‌ణంలోని హోట‌ల్ హిమాల‌య‌లో గ‌జ‌ల‌ప్ప తృతీయ వ‌ర్దంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజ‌రై గజ‌ల‌ప్ప చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట
తాండూరు మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు త‌దిత‌రులు ఉన్నారు. అంత‌కుముందు తాండూరుకు చెందిన సాయిపుత్ర హోమ్స్ అధినేత శంక‌ర్ యాదవ్, బీసీ సంఘం నాయ‌కులు స‌య్య‌ద్ షుకూర్ తో పాటు రాజ్ కుమార్ కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, బంధువులు, స్నేహితులు గ‌జ‌ల‌ప్పకు నివాళులు అర్పించారు.