చలాన్ల చెల్లింపుపు మరో అవకాశం
– ఏప్రిల్ 15 వరకు గడువు పొడగింపు
హైదారాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వ ఊరటను అందించించింది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపులకు మరోసారి అవకాశం కల్పించింది. మొదట చెల్లింపులకు మార్చి 31 వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే సర్వర్ బిజీ రావడంతో కొంతమంది వాహనదారులు తమ చలాన్లను క్లియర్ చేసుకోలేకపోయారు. దాంతో ఈ ఆఫర్ను మరో 15 రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 15 వరకు ఈ అవకాశం పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. బైకులకు 25 శాతం చెల్లిస్తే.. మిగతా 75 శాతం చలాన్ అమౌంట్‌ను రాయితీ కింద మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు. దాంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ మేరకు చలాన్ల చెల్లింపులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయని ఆయన తెలిపారు. ఈ చలాన్ల ద్వారా 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు హోంమంత్రి చెప్పారు.

