చలివేంద్రాల సేవా ప్రజా అంకితం..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో మూడు టీఆర్ఎస్ చలివేంద్రాలు ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే చలివేంద్రాల సేవను ప్రజలకు అంకితమిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, మల్లప్ప మడిగ, పోలీస్టేషన్ చౌరస్తా వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ చలివేంద్రాలను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలింవేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని ఈ మూడు చలివేంద్రాలలో ప్రతిరోజు శుద్ధి చేసిన మినరల్ వాటర్ ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బాటసారులు, పాదచారులు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సేవలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాల సేవలను ప్రజలకే అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, సంతోష్ గౌడ్, నాయకులు నర్సిరెడ్డి, చెన్ బసప్ప, స్టేషన్ హానుమాన్ చైర్మన్ సంజీవరావు, కోఆప్షన్ సభ్యులు వెంకట్ రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

