కోటబాస్పల్లిలో వైభవంగా శ్రీరామనవమి
– కళ్యాణంలో పాల్గొన్న నర్సింహారెడ్డి(బాబు) దంపతులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరుపుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల తరువాత గ్రామంలో శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకున్నారు. సీతారాముల కళ్యాణోత్సవంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సోదరుడు గొట్టిగ నర్సింహా రెడ్డి(బాబు), సతీమణీ సుస్మితారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మద్య స్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని వీధుల్లో శ్రీసీతారామచంద్రులను ఊరేగింపుగా ఆలయానికి తీసుకవచ్చారు. ఈ కళ్యాణోత్సవంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు.

