బీసీ సంఘం, జైభీం ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ జ‌యంతి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ సంఘం, జైభీం ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ జ‌యంతి
– పూల‌మాల వేసి నివాళులు అర్పించిన రాజ్ కుమార్
– జ‌యంతిలో కేక్ క‌ట్ చేసిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీసీ సంక్షేమ సంఘం, జైభీం ఎడ్యూకేటింగ్ పీపుల్స్ సంఘాల‌ ఆధ్వ‌ర్యంలో తాండూరు నాయ‌కులు భారతర‌త్న డా.బీఆర్. అంబేద్క‌ర్ 131 వ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో ఉన్న విగ్ర‌హానికి బీసీ సంఘం తాండూరు క‌న్విన‌ర్ రాజ్ కుమార్ పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం నాయ‌కులు కేక్‌ను క‌ట్ చేసి పంచిపెట్టుకుని జ‌యంతి శుభాకాంక్ష‌ల‌ను తెలుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంఘం రాష్ట్ర నాయ‌కులు స‌య్య‌ద్ షుకూర్, జైభీం ఎడ్యూకేటింగ్ పీపుల్స్ సంఘం అధ్య‌క్షులు న‌ర్సింహా ఎన్టీఆర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాఘ‌వేంద‌ర్, కార్య‌ద‌ర్శి సాయిప్ర‌సాద్, కార్యానిర్వ‌హక అధ్య‌క్షులు శివ‌కుమార్, స‌భ్యులు జుంటుప‌ల్లి వెంక‌ట్, వినోద్, కృష్ణ‌, ర‌జ‌క పెంట‌య్య‌, న‌ర్సింహా, డీజే మ‌తిన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.