వార్డు సమస్యలకు తక్షిణ  పరిష్కారం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

వార్డు సమస్యలకు తక్షిణ  పరిష్కారం

వార్డుల్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే పర్యటన 

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేపట్టిన గల్లి గల్లి కి పైలెట్ కార్యక్రమం లో 3,4,5,6 వార్డులలో పర్యటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తో కలిసి ఎమ్మెల్యే వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు విద్యుత్ మురుగు కాలువలు తదితర సమస్యలు తెలుసుకుని  తక్షణమే పరిష్కారం దిశగా అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రౌఫ్, కౌన్సిలర్ల శోబా రాణి, భీమ్ సింగ్, అస్లం, మంకల రఘు, బోయ రవి, వెంకన్న గౌడ్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.