మార్వాడి యువ‌మంచ్ మాన‌వ‌త్వం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

మార్వాడి యువ‌మంచ్ మాన‌వ‌త్వం
– ర‌క్తనిధిలో కొర‌త తీర్చేందుకు ర‌క్త‌దానం
– ఆసుప‌త్రిలో ర‌క్త‌దాన శిబిరానికి స్పంద‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మార్వాడి యువ‌మంచ్ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటోంది. తాండూరు ప్ర‌భుత్వ‌ జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ర‌క్త‌నిల్వ‌ల కొర‌త ఏర్ప‌డ‌కుండా మార్వాడి యువమంచ్ విశేష సేవ‌ల‌ను అందిస్తుంది. ప్ర‌తినేల 8 నుంచి 10 యూనిట్ల వ‌ర‌కు ర‌క్త‌దానం చేస్తూ కొర‌త లేకుండా స‌హాకారం అందిస్తుంది. మంగ‌ళ‌వారం కూడ ఆసుప‌త్రిలో ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ శిబిరంలో మంచ్ సభ్యులు 30 మంది వరకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ మంచ్ అందిస్తున్న తోడ్పాటును అభినందించారు. మంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్ మాట్లాడుతూ బసవ జయంతితో పాటు రక్తనిధి కేంద్రంలో ఏర్పడిన కొరతను దృష్టిలో ఉంచుకుని రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజ్ నిహారి సోని, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోహిత్ అగ్రవాల్, సభ్యులు మహేష్ సార్థా, సన్ని అగ్రవాల్, సూర్యప్రకాష్ సోమాని ఉపాధ్యక్షులు అనిల్ సార్థా, ఆశిష్ సార్థా, దినేష్ వర్తాని, కార్యదర్శి కిషన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్థా, భగవాన్ దాస్ బూబ్, రామానుజ్ దాస్ సోని, రాజస్తాని మహిళ మండలి సభ్యులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.