ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
– తొలిరోజు 176 మంది గైర్హాజరు
– వెల్లడించిన కస్టోడియన్లు మల్లినాథ్, కృష్ణయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సింధూ బాలికల జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల, అంబేద్కర్ పారమెడికల్ కళాశాల, సిద్దార్థ జూనియర్ కళాశాలతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల, తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల కళాశాలను ఏర్పాటు చేశారు.
ప్రతి కేంద్రానికి 300ల మంది విద్యార్థులను కేటాయించారు. శుక్రవారం తొలిరోజు 2826 మంది అలార్ట్ చేయగా జనరల్ విభాగంలో 2035 మంది విద్యార్థులు హాజరై 130 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 661 మందికి గాను 615 మంది హాజరై 46 మంది గైర్హాజరయ్యారు. తొలి రోజు మొత్తం 176 మంది గైర్హాజరుతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని కస్టోడియన్లు మల్లినాథ్, కృష్ణయ్యలు తెలిపారు.

