న‌మో: ఆదిశంక‌రాచార్యా..!

తాండూరు వికారాబాద్

న‌మో: ఆదిశంక‌రాచార్యా..!
– తాండూరులో వైభ‌వంగా జ‌యంతి ఉత్స‌వాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌కుడు.. ఆదిశంక‌రాచార్య స్వామి సేవ‌లో తాండూరు భ‌క్తులు త‌రించారు. శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణం సీతారాంపేట్‌లోని శ్రీ పాండురంగా స్వామి దేవాల‌యంలో ఆదిగురువు ఆది శంక‌రాచార్య స్వామి జ‌యంతిని బ్రాహ్మ‌ణ స‌మాజం ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా జ‌రుపుకున్నారు. దేవాలయంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ప‌లువురు మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాలు జీవించారని తెలిపారు. ఈ సమయంలోనే స్వామి 3 సార్లు ఆసేతు హిమాచలం వరకు పర్యటించి ధర్మోద్ధరణ చేసి, అద్వైత మతస్థాపన చేశారన్నారు. ధర్మప్రచారం కోసం 4 దిక్కుల్లో పీఠంలు ఏర్పాటు చేసిన మహానీయుడన్నారు. సాక్షాత్తు పరమశివుని అంశమని కొనియాడారు. ఈ జయంతి ఉత్సవాలలో బ్రాహ్మ‌ణ స‌మాజం గౌర‌వాధ్య‌క్షులు గోనూరు ద‌త్తాత్రేయ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోనూరు రాఘ‌వేంద్ర‌, స‌భ్యులు కౌశిక్ గురురాజ్, దీక్షిత్‌ గురురాజ్ జోషి, రాఘ‌వేంద‌ర్, మంగ‌ళ డోకే, భక్తులు పాల్గొన్నారు.