ఆదర్శ వివాహాలకు ప్రోత్సాహాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కొత్త జంటకు రూ. 2.50లక్షల బాండ్‌ను అందజేత
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సహాం అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో ఆదర్శ వివాహాం చేసుకున్న మహిపాల్, సావిత్రి అనే జంట ప్రోత్సహాం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ. 2.50లక్షల బాండ్‌ను మంజూరు చేసింది. బుధవారం మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కొత్త జంటకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2.50 లక్షల రూపాయల బాండ్ ను దంపతులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం నూతన దంపతులకు ఆర్థికంగా పరిపుష్టి కలిగిస్తదని, కొత్త జంట ప్రారంభించబోయే వైవాహిక జీవితం ఆర్థికంగా నిల దొక్కుకోవడానికి సహకరిస్తుందన్నారు. వచ్చిన ప్రోత్సాహకాన్ని సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత భార్యదేనని చెబుతూ కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రోత్సాహక బాండ్‌ను స్వీకరించిన జంట ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

