హ‌నుమాన్ మందిర నిర్మాణానికి రూ. 50వేలు

తాండూరు రాజకీయం వికారాబాద్

హ‌నుమాన్ మందిర నిర్మాణానికి రూ. 50వేలు
– విరాళం అందించిన న‌ర్సింహారెడ్డి(బాబు)
బ‌షీరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌లం కాశింపూర్ గ్రామంలో నిర్మిస్తున్న హనుమాన్ మందిరంకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి సోద‌రుడు, స్వ‌ర్గీయ ఇంద్రారెడ్డి చారిట్రుబుల్ ట్ర‌స్ట్ చైర్మ‌న్, తాండూరు సీటీకేబుల్ ఎండి గొట్టుగ న‌ర్సింహారెడ్డి(బాబు) రూ. 50వేలు విరాళం అంద‌జేశారు. బుధ‌వారం గ్రామంలోని హ‌నుమాన్ మందిర నిర్మాణాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్మాణం కోసం రూ. 50 వేల న‌గ‌దుతో పాటు నిర్మాణానికి తోడ్పాటుగా మార్బుల్(గ్రానెట్స్) కూడా ఇప్పిస్తాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు, యలాల మాజీ ఎంపీపీ కర్ణం పురుషోత్తం రావు, ఉపాధ్యాయులు నాగప్ప, కిష్టప్ప, నర్సిరెడ్డి, పోలీస్ వెంకటయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, గంగయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.