ప‌ల్లెల ప్ర‌గ‌తే ధ్యేయం

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ప‌ల్లెల ప్ర‌గ‌తే ధ్యేయం
– గ్రామాల‌ అభివృద్ధికి జడ్పి నిధులు
– ఇక నుంచి ప్రతీ గ్రామానికి వస్తాం
– తాండూరు ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
– వికారాబాద్ జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి వెల్లడి
– తాండూరు మండలంలో జడ్పి పనులకు శ్రీకారం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌ల్లెల ప్ర‌గ‌తే తెలంగాణ స‌ర్కారు ధ్యేమ‌ని వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మండలం నారాయణపూర్, ఎల్మకన్య, చింతామనిపట్నం, పర్వతాపూర్, బెల్కాటూరు, రాంపూర్,సీరిగిరిపేట్, మల్కాపూర్, కోట్ బాస్పల్లి గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పానాది రోడ్లను ప్రారంభించారు. ఈ సంధర్బంగా సునీతారెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. జడ్పి నిధుల కేటాయింపుల్లో తాండూరుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, ఎవరికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. రూ.7 కోట్లతో జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మతులకు రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జడ్పి నిధులతో పల్లెల్లో సీసీ రోడ్లు, పానాది రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, డ్వాక్రా భవనాల వంటి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. పానాది రోడ్లు వేయడం వలన రైతులకు పాట ఉత్పత్తులు మార్కెట్ కు తరలించడానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి దశల వారిగా జడ్పి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పల్లెల్లో ఇంకా అవసరం ఉన్నచోట సీసీ రోడ్లు, మురుగు కాలువలు, డ్వాక్రా, అంగన్ వాడి భవనాలు నిర్మించడానికి నిధులు కేటాయింపులు చేస్తామని అన్నారు. ఈ
సంధర్బంగా ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిత గౌడ్, జడ్పిటీసీ గౌడి మంజూల, పీఏసీఎస్ చైర్మన్ రవి గౌడ్, వైస్ ఎంపీపీ స్వరూప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఎంపీటీసీ ఎర్ర నర్సమ్మ, రాజమని, రత్నమాల, రవిసిందే , సర్పంచ్ లు చంద్రప్ప, విమలమ్మ, లాల్ రెడ్డి, నాగార్జున, మేఘనాథ్ గౌడ్, రాధిక, విజయలక్ష్మి, యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు, బషీరాబాద్ జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి, యాలాల, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, యాలాల మాజీ పీఏసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నాయకులు సుధాకర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, అగ్గనుర్ భీమప్ప, కౌన్సిలర్ నీరాజారెడ్డి, నాయకులు గౌడి వెంకటేష్, డివై నర్సింలు, జుబేర్ లాల, పండరీ, శంశుద్దీన్, నర్సింలు, ఎర్ర శ్రీనివాస్, రఘు, రాకేష్, శ్రీకాంత్ రెడ్డి, జడ్పి డిప్యూటీ సీఈఓ శుభాషిని, డీఈఈ వెంకట్ రావ్, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, మండల అధికారులు, సునితమ్మ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.