డబుల్ సర్కారు ఏర్పాటు ఖాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్ సర్కారు ఏర్పాటు ఖాయం
– తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
– ధరల తగ్గింపు హర్షణీయం
– బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు ఖాయమని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించడం పట్ల ప్రధాని మోడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 26న రాష్ట్రానికి ప్రధాని మోడి వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ విడిది యాత్రలకు వెళ్లడం విడ్డూరమన్నారు. 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తూ వచ్చాన్నారు. రాష్ట్రంలో మద్యం, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచి భారం మోపడమే కాకుండా రాష్ట్రంలో ధరలు ఎప్పుడు పెంచినా కేంద్రంపై నెట్టేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిహారాలు చెల్లించని సీఎం కేసీఆర్ పంజాబ్లో రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం కూడ మరో మోసమే అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టి డబుల్ ఇంజర్ సర్కారును ఏర్పాటు చేయడం భామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాండు గౌడ్, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, మహిళ మార్చ జిల్లా అధ్యక్షురాలు, కౌన్సిలర్ సాహు శ్రీలత, సీనియర్ నాయకులు పూజారి పండు, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.