ఖబడ్దార్ రేవంత్ రెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఖబడ్దార్ రేవంత్ రెడ్డి..!
– రెడ్ల‌ ఆధిపత్యంతో బహుజనులను కించపరుస్తారా
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీలు లేకుంటే పార్టీల‌ మనుగడేది
– తాండూరులో బీసీ మహారాజులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేదా
– టీపీసీసీ అధ్యక్షులు బహిరంగా క్షమాపణ చెప్పాలి
– ప్రజా సంఘాల నాయకులు డిమాండ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డిని తాండూరు ప్రజా సంఘాల నాయకులు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన సమావేశంలో టీపీపీపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రెడ్లతోనే పార్టీల మనుగడ సాధ్యమవుతుందని వ్యాఖ్యలు చేస్తూ బహుజనులను తక్కువ చేస్తూ, కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డంపై సోమవారం బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు. బహుజనులను కించపరుస్తారా అంటూ మండి పడ్డారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ తో పాటు సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, కేవీపీఎస్ నాయకులు ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుగ్గప్ప, బీసీ సంఘం నాయకులు షుకూర్, అబ్బని బసయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆరాచకాలను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులుగా నియమిస్తే ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ, బీసీల వర్గాలను అవమానించే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌న్నారు. రెడ్ల‌తోనే పార్టీల‌ మనుగడ సాధిస్తుందని వాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఖబ‌డ్దార్ రేవంత్ రెడ్డి అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యధికంగా 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు లేకపోతే ఏ పార్టీలు మనుగడ సాధించలేవన్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్లు బహుజనులను ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. రెడ్ల తోనే పార్టీలు, ప్రభుత్వాలు సాధ్యమవుతాయా అంటూ ధ్వజమెత్తారు. తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలు బీసీ వర్గాలతో కొనసాగుతున్నాయన్నారు. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, తాండూరులో మహరాజుల కుటుంబాలు లేకపోతే కాంగ్రెస్ గతి అధోగతి అవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలకు ఆయన బహుజనులకు బహుజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాబోవు రోజుల్లో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం చేపట్టే విధంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం పట్టణు మహిళ అధ్యక్షురాలు జ్యోతి, బీసీ సంఘం యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారీ, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్, రాధాకృష్ణ, బసు, టైలర్ రమేష్, రాము ముదిరాజ్, జంటుపల్లి వెంకట్, తాండ్ర నరేష్, మహదేవ్, మంతన్ గౌడ్ అశోక్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.