విజయాలకు కేరాఫ్ సింధు డిగ్రీ కాలేజీ

కెరీర్ తాండూరు వికారాబాద్

విజయాలకు కేరాఫ్ సింధు డిగ్రీ కాలేజీ
– డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
– సంబరాలలో అభినందించిన యజమాన్యం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: డిగ్రీ పరీక్షల ఫ‌లితాల‌లో సింధు డిగ్రీ కళాశాల విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని కళాశాల అధ్యక్షులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి రంగారావులు పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన విద్యార్థులు బీఎస్సీ(బీజెడ్సీ) ఐదో సెమిస్టర్ లో బి. సౌజన్య (9.88 ఎస్‌జీపీఏ), సంజా సిమ్రాన్ (9.88 ఎస్‌జీపీఏ), బీకాం(కం.ఏపీఎల్)లో నేహా తాతిమా(9,88 ఎస్‌జీపీఏ), షాజ్మీన్ భాగం (9.88 ఎస్‌జీపీఏ)లు సాధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. మొదటి సెమిస్టార్ లో బీఎస్సీ (బీజెడ్సీ)లో షాదన్ దహ్రీమ్ (9.48), బీఎస్సీ (ఎంపీసీఎస్)లో మమత (9.68), జీ. ప్రవీణ (9,52), బీకాం(కం.ఏపీఎల్) లో సల్మా భేగం(9.32), బీఏ (హెచ్ఈపీ)లో రాథోడ్ మౌనిక(9.08), బీబీఏలో హజ్రా ఫాతిమా(9.08) ఎస్‌జీపీఏలు సాధించారు. మూడో సెమిస్టర్ లో బీఎస్సీ (ఎంపీసీ)లో సానియా జబీన్(9.84), బీఎస్సీ (ఎంపీసీఎస్)లో జీ.వినీత(9.64), బీఎస్సీ (బీజెడ్సీ)లో మహ్వేష్ మర్గమ్(9.52), బీకాం(కం.ఏపీఎల్)లో వసీమా ఖాతూమ్ (94), బీబీఏలో ముసా ఫేరా తహ్రీమ్ (9.36), బీఏలో బాల్ రాజ్ (9.04) ఎస్‌జీపీఏలు సాధించారు. ఐదో సెమిస్టర్ లో బీఎస్సీ (ఎంపీయూ)లో సల్మా భానమ్ (9.72), బీఎస్సీ (ఎంపీసీ)లో ఎం.సంధ్యా(9.68), బీకాం(కం)లో ఈ. అక్షిత(9.76), బీఎస్సీ(బీజెడ్సీ)లో ఆయేషా ముల్తానా(9.72), తెలుగు మీడియం నుంచి ఎం. శీరీష. 19.32, బీఏలో ఎం.స్వాతి(9.48) ఎస్‌జీపీఏలు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో సంబరాలు నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యక్షులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవి రంగారావులు అభినందించారు. ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు విజ‌యాల‌కు కళాశాలను కేరాఫ్ అడ్రస్ గా నిలప‌డం సంతోషక రమన్నారు.