తాండూరుకు శ్రీ‌శ్రీ‌శ్రీ ప‌రిపూర్ణానంద స్వామి రాక

తాండూరు వికారాబాద్

తాండూరుకు శ్రీ‌శ్రీ‌శ్రీ ప‌రిపూర్ణానంద స్వామి రాక
– గీతా సత్సంగ్ పారాయ‌ణ ఉత్స‌వాల‌కు హాజ‌రు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆధ్యాత్మిక గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ ప‌రిపూర్ణానంద సర‌స్వ‌తి స్వామి నేడు తాండూరుకు విచ్చేయ‌నున్నారు. తాండూరులోని శ్రీ గీతా సత్సంగ్ స‌మితి 13వ మండ‌ల పారాయ‌ణ వార్షికోత్స‌వ వేడుక‌లు రెండు రోజులుగా కొన‌సాగుతున్నాయి. పారాయ‌ణ వార్షికోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్స‌వాల‌లో ప‌రిపూర్ణానంద స్వామి పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ప‌రిపూర్ణానంద స్వామి పాల్గొంటార‌ని గీతా సత్సంగ్ స‌మితి స‌భ్యులు తెలిపారు. కావుకు భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గిని కార్యక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

కింది వ‌ర‌కు చూడండి…