నేడు కోడంగల్కు మంత్రి హరీష్ రావు రాక
– అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
– ఏర్పాట్లు చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు తాండూరు డివిజన్లోని కోడంగల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. మంత్రి హరిష్ రావుతో పాటు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కూడ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఒకరోజు ముందే మంత్రి హరిష్ రావు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కోడంగల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు 50 పడకల ఆసుపత్రి నూతన భవనం, డయాలిసిస్ సెంటర్, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.



