బీసీ మహిళల ఐక్యమత్యాన్ని చాటాలి
– రాజకీయ, ఆర్థికాభివృద్ధిలో కీలకం
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో బీసీ మహిళ కార్యవర్గ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ మహిళల ఐక్యమత్యాన్ని సమాజానికి చాటి చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ పేరొ న్నారు. సోమవారం బీసీ సంఘం తాండూరు మహిళ అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో పట్టణంలోని హిమాలయ హోటల్లో బీసీ మహిళ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కన్వినర్ రాజ్ కుమార్ హాజరై మాట్లాడారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే మహిళలు ఐక్యమత్యంగా ఉండాలన్నారు. బీసీల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందన్నారు. తాండూరులో బీసీ సమీకృత భవనం సాధించుకోవాలని, ఇందుకు అందరు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. మహిళలను డ్వాక్రా గ్రూపులకే పరిమతం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీసీ మహిళ కార్యవర్గ సభ్యులుగా సాయిపూర్ లక్ష్మీ, రాజీవ్ కాలనీ అనిత, ఇందిరానగర్ విజయలక్ష్మి, మంజుల సుమన్, చిట్టెమ్మ, విజయలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ మకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, తాండూరు మండల అధ్యక్షులు బసంత్, యువనాయకులు టైలర్ రమేష్, జుంటుపల్లి వెంకట్, తాండ్ర నరేష్, రజక నర్సింహా, బస్సు, జగదీష్, శివ, మతీన్, మహదేవ్, వివిధ వార్డుల మహిళలు తదితరులు పాల్గొన్నారు.


