‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..

సినిమా
‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..
ద‌ర్శిని ప్ర‌తినిధి : సినిమాల్లోకి రాక ముందు షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రహీరో.. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. ఆతర్వాత సినిమా చూపిస్తా మామా, కుమారి 21ఎఫ్, ఆడోరకం- ఈడోరకం, రీసెట్‌గా ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాతో ఆకట్టుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో.  ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకు ‘అనుభవించు రాజా’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సహకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా మూవీ రూపొందుతుంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను కింగ్ నాగార్జున చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో జాతర జగరుగుతుండగా మెడలో బంగారపు చైన్లు – చేతికి ఉంగరాలు – బ్రాస్ లెట్ ధరించి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పందెం కోడిని నెమరుతూ కనిపించాడు రాజ్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా.. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం రాస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.