వ‌ర్షాలతో ఇబ్బందులుంటే కాల్ చేయండి

తాండూరు వికారాబాద్

వ‌ర్షాలతో ఇబ్బందులుంటే కాల్ చేయండి
– జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు
– వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారీగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఎవ‌రైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారుల దృష్టికి తీసుక‌రావాల‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల సూచించారు. సోమ‌వారం వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ‌ని, దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వర్షాల వల్ల సమస్యలు తలెత్తినట్లయితే కంట్రొల్ రూం దృష్టికి తీసుక‌రావాల‌న్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నెంబ‌ర్ 7995061192కు తెలిపాల‌ని సూచించారు. అదేవిధంగా ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న‌ వర్షాలతో ప్రజలు సురక్షిత ఉండేవిధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాలలో తప్పిస్తే ఎవరు బయటికి రాకూడదన్నారు. వ‌ర్షాల ప‌రిస్థితి దృష్ట్యా మండల స్థాయి అధికారులు పరిస్థితులను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని ఆదేశించారు.