వైభవంగా గురిపౌర్ణిమ
– షిర్డి సాయిబాబా దేవాలయంలో పోటెత్తిన భక్తులు
– దర్శించుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో భక్తులు గురిపౌర్ణిమను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బుధవారం గురుపౌర్ణిమి సందర్భంగా తాండూరు కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన షిర్డి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉదయం మేలుకోలుపు, సామూహిక పుష్పాభిషేకం, మహానైవేద్యం, మధ్యాహ్నం మధ్యాహ్న హారతి, సాయంత్రం దూపహారతి వంటి కార్యక్రమాలను ఆలయ కమిటి సభ్యులు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని తాండూరు పట్టణ ప్రజలు, కోకట్ గ్రామస్తులు, వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి పోటెత్తారు.
దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సాయిబాబా దర్శనార్థం బారులుతీరారు. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయంలో సాయిభక్తులు భక్తి పారవశ్యంతో భజన కీర్తనలు ఆలపించారు.
సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
మరోవైపు కోకట్ రోడ్డు మార్గంలోని షిర్డి సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దె వాలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, తాండూరు వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు బంటు మల్లప్ప, బిడ్కర్ రఘు, రాజశేఖర్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు బాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు.



