మట్టి గణపతులకే చందాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టి గణపతులకే చందాలు..!
– ఎల్‌నినోతో కరువు వచ్చింది, కాగ్నాలో నీరు లేదు
– ఉత్సవ సమితిలు సహకరించాలి
– ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పిలుపు
– మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
– చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు వచ్చిందని, కాగ్నానదిలో నీరు లేదని కావున వినాయక ఉత్సవ సమితిలు సహకరించాని, సాధ్యమైనంత ఎక్కువ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు చేయాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి, మహా గణపతి అనే కార్యక్రమాన్ని పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మట్టి గణపతులు ప్రతిష్టించే వారికి చందాలు ఇవ్వాలని సూచించారు. పకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజించాలని అన్నారు. ఇండ్లల్లో, వాడల్లో అందరు కూడా మట్టి గణపతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కాగ్నానదిలో నీరు లేదని, కావున వినాయక ఉత్సవ సమితిలు అంతా కూడా ఈసారి జరిగే గణేష్ ఉత్సవాలకు సహకరించాలని అన్నారు.

మట్టి గణనాథులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని అన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీకి కృషి చేస్తామని అన్నారు. మార్కెట్ కమిటి చైర్మన్, హిందూ ఉత్సవ కమిటి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పాటు రసాయనాలతో తయారు చేసిన వినాయకుల వల్ల కాగ్నానది కలుషితం అవుతుందని అన్నారు. అందరు మట్టి వినాయకుల ప్రతిష్టాపనకు ముందుకు రావాలని అన్నారు.

మరోవైపు కొన్నేళ్లుగా మట్టి వినాయకులను తయారు చేస్తూ వివిధ దేశాలకు, రాష్ట్రాలకు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న కుల్కచర్ల మండలం చేపలగూడేంకు చెందిన స్వామి, తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శంకర్‌ను గోశాల ఆధ్వర్యంలో సన్మానించారు. మట్టి గణపతులను పంపిణీ చేస్తూ స్పూర్తి నింపుతున్న బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంజ్‌ అసోసియేషన్ అధ్యక్షులు కట్కం వీరేందర్, గోశాల సేవా సమితి అధ్యక్షులు వినోద్ జైన్, గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సార్డా, కోశాధికారి పటేల్ విజయ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటం మురళీ, వీరశైవ సమాజం అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, సనాతన ధర్మం ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పర్యాద రామకృష్ణ, వివిధ కుల సంఘాల, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పొంగిన దేశభక్తి..!