హక్కుల భావుట చాకలి ఐలమ్మ
– ఎన్ఎస్‌యూఐ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అందరు తమ హక్కుల కోసం పోరాడలంటూ చాకలి ఐలమ్మ బావుట ఎగురవేశారని ఎన్ఎస్‌యూఐ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చాకలీ ఐలమ్మ వర్దంతి సందర్భంగా వీవీహెచ్ఎస్ సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రజాకారులు, పెత్తందారులు, దొరల అరాచకాలను రూపుమాపేందుకు చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు. అందరు హక్కుల కోసం ఉద్యమించాలని స్పూర్తినింపిన ధీరవనిత అని, ఆమె ఆశయ సాధనకు కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం యువనాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


