మ‌రో మూడు రోజులు సెల‌వులు పొడిగింపు

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మ‌రో మూడు రోజులు సెల‌వులు పొడిగింపు
– ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థ‌ల‌కు మ‌రో మూడు రోజులు సెల‌వులను పొడ‌గించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌త సోమ‌వారం నుంచి నేటి వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో.. మ‌రో మూడు రోజుల పాటు సెల‌వుల‌ను పొడిగించారు. సోమ‌వారం నుంచి విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం కానున్నాయి. భారీగా కురుస్తోన్న వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పట్టిన వాగులు మాత్రం పొంగి పొర్లడం ఖాయం. ఈ కారణంగానే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమాచారం.