దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత

క్రైం తాండూరు వికారాబాద్

దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
– రూ.2670లు, ఏటీఎం కార్డులు భద్రం
– యువకుడి నిజాయితిని అభినందించిన పోలీసులు.

తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డుపై దొరికిన పర్సు, అందులోని ఏటీఎం కార్డులు, నగదును పోలీసులకు అప్పగించాడు ఓ యువకుడు. వివరాలు తెలసుకున్న పోలీసులు సంబధితునికి అందజేశారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం వీర్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి మల్లేశం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ నుంచి వస్తుండగా రోడ్డు పై ఒక పర్సు దొరికింది. అందులో రూ. 2670 నగదుతో పాటు ఏటిఎం కార్డులు ఉన్నాయి. వివరాలను పరిశీలించగా యాలాల మండలంలోని వేణుగోపాల్ కు చెందినట్లుగా గుర్తించారు. పర్సును తీసుకుని నేరుగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో అప్పగించాడు. వివరాలను పరిశీలించిన పోలీసులు వేణుగోపాల్ ను పిలిపించి పర్సు, ఏటీఎం కార్డులను అందజేశారు. రోడ్డుపై దొరికిన పర్సును తెచ్చి ఇచ్చిన మల్లేశంను తాండూరు తాండూరు పట్టణ ఏఎస్ఐ లక్ష్మీనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, నర్సింలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.