కేసీఆర్ సంక్షేమ పథకాలతో అభివృద్ధి
– ఎమ్మెల్యే రోహితన్న ఆధ్వర్యంలో తాండూరు ప్రగతి
– టీఆర్ఎస్ నియోజక వర్గ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్
– తాండూరు సెలబ్రిటీకి ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతోనే అందరు అభివృద్ధి సాధిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి, తాండూరు సెలబ్రిటి సాగర్ గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా సోమవారం తాండూరు పట్టణంలోని 12 వ వార్డులో జ్యోతి, శ్రీధర్ గౌడ్ వారి నివాసంలో సాగర్ గౌడ్ కు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెట్టిన అసరా, కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్, రైతుబందు, దళిత బంధు, గిట్టుబాటు ధర వంటి తదితర పథకాలతో పేదలందరు అభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం ప్రగతి వైపు దూసుకెళుతోందన్నారు. తాండూరు బైపాస్ రోడ్డు, నేషనల్ పై వావే, పాత తాండూరుకు రైల్వే బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తాండూరు రూపు రేఖలు మార్చబోతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఆయన నాయకత్వాన్ని అందరు బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పాల్గొన్నారు.



