ప్లాస్టిక్ వాడితే పెనాల్టీ త‌ప్ప‌దు

ఆరోగ్యం తాండూరు

ప్లాస్టిక్ వాడితే పెనాల్టీ త‌ప్ప‌దు
– ముమ్మ‌రంగా త‌నిఖీలు చేస్తున్న సిబ్బంది
– పోలీసుల స‌మ‌క్షంలో జ‌రిమానాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిషేధిత ప్లాస్టిక్ వాడితే పెనాల్టీ త‌ప్ప‌ద‌ని తాండూరు మున్సిప‌ల్ అధికారులు సూచిస్తున్నారు. గ‌త నెల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన ప్లాస్టిక్ నిషేధాన్ని తాండూరు ప‌ట్ట‌ణంలో ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. ముందుగా వ్యాపారుల‌కు నోటీసులు అందించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వినియోగిస్తే జ‌రిమానాలు విధిస్తామ‌ని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యేక బృందాలు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. పట్టణ పోలీసుల సమక్షంలో ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం. మున్సిపల్ జవాన్లు పట్టణంలోని గాంధీచౌక్ ప్రాంతంలోని వస్త్ర దుకాణాలు, హోటళ్లు, వి విధ వ్యాపార సముధాయాలలో తనిఖీలు చేసి నిషేధిత ప్లాస్టిక్ను స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. గాంధీ చౌక్ ప్రాంతంలోని మమ్మి.. డాడీ షాపింగ్ మాల్లో రూ. 5వేల వరకు జరిమాన విధించారు.