మంకీపాక్స్‌కు ఆయుర్వేద చికిత్స
– చిట్కాలను పాటిస్తే వ్యాధి నయం
– మరిన్ని జాగ్రతల గురించి తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రపంచాన్ని వణికించిన కరోనా తరువాత మంకీపాక్స్ మళ్లీ ప్రజలను భయపెడుతోంది. ఇప్పటికే భారత దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తొలి మరణం కూడ సంబవించింది. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వైరస్ లక్షణాలు 6 నుండి 12 రోజులలో కనిపిస్తాయి. ఈ లక్షణాలలో మైకము, అధిక జ్వరం , దద్దుర్లు, వాపు ఉంటాయి. మంకీపాక్స్ చికిత్సలో భాగంగా టీకాలు, మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే మీరు కొన్ని ఆయుర్వేద నివారణలను అనుసరించడం ద్వారా చాలా వరకు ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూలికలతో ప్రభావం
మంకీపాక్స్‌ను ఎదుర్కోవాలంటే బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండాలి. ఆయుర్వేదంలోని కొన్ని మూలికల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, మీరు త్రిఫల, అర్గవధ, త్రివత్ వంటి మూలికలను తీసుకోవాలి. ఈ ఆయుర్వేద మూలికల ద్వారా వైరస్ నుంచి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. మీ చర్మంపై దద్దుర్లు ఉంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. మీరు అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తే శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా వేప నీళ్లతో తలస్నానం చేస్తే శరీరంపై ఉండే దద్దుర్లు కూడా తగ్గుతాయి. మీరు వేప పత్ర క్వాత్, త్రిఫల క్వాత్ తో చర్మాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు.
యోగాతో సత్పలితం
యోగాసానాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. తడసానా, బాలాసన్ వంటి యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇది కాకుండా, ఈ యోగాసనాలతో చురుకుగా ఉండగలుగుతారు.
ద్రవపదార్థలతో ఆహారం తీసుకోండి
మీరు మంకీపాక్స్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు సాధారణ ఆహార పద్ధతిని అనుసరించాలి. మూంగ్ దాల్‌ను తినడం ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మీరు ఉదయం అల్పాహారంగా ఓట్స్ లేదా గంజిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఆహారంలో ద్రవపదార్థాలను చేర్చుకోండి .పండ్లలో దానిమ్మ వంటి పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)



