భయం, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి
– పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
– ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు కుమార్‌గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భయం, ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలని ఎస్ఎఫ్‌ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గౌడ్ అన్నారు.

ఆదివారం ఎస్ఎఫ్‌ఐ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజీలో 10వ తరగతి మోడల్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గౌడ్, తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీదర్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు పాల్గొన్నారు. ఈ మోడల్ పరీక్షలో తాండూరుకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఉత్సహాంగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు కుమార్ గౌడ్, తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీధర్, మైమూద్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి భయాందోళనకు గురి కాకుండా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎలాంటి భయం, చింత లేకుండా పరీక్షలు రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ కమిటీ సభ్యులు ప్రకాష్, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


