జోహర్.. జయశంకర్ సార్..!
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, సంఘాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్.. జోహార్.. జయశంకర్ సార్ నినాదాలతో తాండూరులోని ఇందిరా చౌరస్తా మార్మోగింది. శనివారం తెలంగాణ జాతిపిత ప్రో ఎసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇందిరా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు.
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు సల్మా పాతిమా, బోయ రవిరాజు, రాము, వెంకన్నగౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు బిర్కడ్ రఘు, బీదర్ రాజశేఖర్, దత్తు తదితరులతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అస్లాం, ఆసిఫ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, చెన్ బసప్ప, అబ్దుల్ సలీం, దేవాలయ చైర్మన్ సంజీవరావు తదితరులతో కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు.

బీసీ సంక్షేమ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, లక్ష్మణ్, బసు తదితరులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మరోవైపు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, టీజేఎస్ ఇంచార్జ్ సోమ శేఖర్, టీవీవీ నాయకులు ఆర్. విజయ్ కుమార్, పర్యాద రామకృష్ణ, సీపీఎం నాయకులు శ్రీనివాస్ తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా ఆసుపత్రిలో టీవీవీ. టీజేఎస్ సంఘాల ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్ చిత్రపటానికి కళాశాల ఇంచార్జ్ ఉర్దూ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ సయ్యద్ అశ్రరూల్ హక్ తో పాటు అద్యాపకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు.




