చేతి, కుల‌వృత్తిదారుల అభ్యున్న‌తికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

చేతి, కుల‌వృత్తిదారుల అభ్యున్న‌తికి తోడ్పాటు
– తాండూరులో కార్పెంట‌ర్ల‌కు సంక్షేమ భ‌వ‌నం
– హామి ఇచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: చేతి, కుల‌వృత్తి దారులకు తెలంగాణ సర్కారు తోడ్పాటు అందిస్తుంద‌ని, ఇందులో భాగంగా తాండూరులోని కార్పెంట‌ర్ల అభివృద్దికి స‌హాకారం అందిస్తామ‌ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తాండూరు కార్పెంట‌ర్ అసోసియేష‌న్ స‌భ్యులు ఆయ‌న నివాసంలో మ‌ర్యాద‌ పూర్వకంగా కలిసారు. తాండూరు పట్టణం లో కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సొంత భవనం నిర్మాణానికి స్థ‌లం కేటాయించాల‌ని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ చేతివృత్తుల వారికి, కుల వృత్తుల వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుంద‌న్నారు. అదే స్పూర్తితో తాండూరులో కార్పెంటర్స్ సంక్షేమ సంఘ భవనానికి స్థలం ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. అంత‌కుముందు రాబోవు ఎన్నికలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కార్పెంటర్స్ సంపూర్ణ మద్దతు ఇస్తామ‌ని ప్ర‌క‌ర‌టించారు. రోహిత్ అన్న కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు టీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్, ఇంతియాజ్, కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సురేంద్ర చారి, సంగమేశ్వర్, నజం, కాలప్ప, నారాయణ‌, రహీం, బాలరాజు తదితరులు ఉన్నారు.