తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక
– గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్
– సమితి ప్రధాన కార్యదర్శిగా మూడోసారి పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి యేడాది వినాయక చవితికి ముందు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఆనవాయితిని కొనసాగిస్తోంది. శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమితి నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి గౌరవాధ్యక్షులుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కోశాధికారిగా పూజారిపాండు, ఉపాధ్యక్షులుగా అంతారం కిరణ్ కుమార్, ఆశిష్ అష్టికర్, ముణ్ణపురం రాము, శంకపల్లి శ్రీకాంత్ రెడ్డి, పరమటి వెంకటేశం, జగదీష్ యాదవ్, రమేష్ టైలర్, సహాయ కార్యదర్శులుగా అన్నారం చెన్ బసప్ప, రజక నర్సింహా, ప్రవీణ్, చిద్రి ప్రకాష్, ప్రహాల్లాద్ జాదవ్, కుమార్, ఎస్. గోపాల్, ప్రచార కార్యదర్శులుగా చెన్మిళ్ల సతీష్, తాండ్ర నరేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సురేష్ నాయక్, ఎం. అశోక్, మీడియా ప్రతినిధులుగా బషీరాబాద్ వినోద్, నవీన్ కుమార్, లీగల్ అడ్వయిజర్లుగా పాశం రవికుమార్, పంజుగుల గుండప్ప, ఆధ్యాత్మిక సలహాదారులుగా మడపతి సిద్ధలింగయ్య స్వామిలను ఎన్నుకున్నారు.
సభ్యులుగా సమితి ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల నర్సింలు మూడో సారి ఎన్నిక కావడం విశేషం. 2023-24 సంవత్సరానికి గాను హిందూ ఉత్సవ సమితికి నిర్వహించిన ఎన్నికలలో ఎన్నికల అధికారిగా మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్ వ్యవహరించారు.
ఇది కూడా చదవండి…

