సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా
– 14 నుంచి 16వ తేదికీ మార్పు..?
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 14న జ‌రిగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని అధికార వ‌ర్గాలు స్ప‌ష్టంగా పేర్కొన్నాయి. అయితే 14న జ‌రిగే సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న 16వ తేదికి మారిన‌ట్లు కూడ తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం, నేత‌లు అందుకు త‌గిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 14న జ‌రిగే సీఎం ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం, కొత్త‌గా మంజూరైన మెడిక‌ల్ క‌ళాశాల‌కు శంకుస్థాప‌న‌, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాలు ఖ‌రారు అయ్యాయి. సీఎం ప‌ర్య‌ట‌న వాయిదాతో స్వాతంత్ర్య దినోత్స‌వం మ‌రుస‌టి రోజు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను దిగ్విజ‌యం చేయ‌డంలో అధికారులు, నేత‌లు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.