అన్నిరంగాల్లో అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నిరంగాల్లో అభివృద్ధి
– అడ్డంకులోచ్చినా హామిలు నెర‌వేరుస్తా
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– సామూహిక స్వాతంత్ర్య వేడుకలలో జెండా ఆవిష్కరణ
-విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుక‌పోతుంద‌ని, అదే స్పూర్తితో తాండూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌రుస్తామ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సామూహిక స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. వ‌జ్రోత్స‌వాల‌లో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఆనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకపోతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అసరా, రైతుబంధు, దళిత బంధు, షాదీ ముభారక్, కళ్యాణలక్ష్మీ, ఆసరా తదితర పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు, పాత రైల్వే బ్రిడ్జి, కాగ్నా నదిపై బ్రిడ్జిలతో పాటు మిషన్ భగీరథ పథకాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. రోడ్లకు మహర్ధశ తీసుకరావడం జరిగిందని, పట్టణంలో మాతా శిశు ఆసుపత్రితో పాటు ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకవచ్చి ఉత్తమ సేవలను అందించడం జరుగుతుందున్నారు. దీంతో పాటు పారిశ్రామిక పార్కు, ఆటోనగర్, 30 ఎకరాలలో నూతన మార్కెట్ యార్డు, రూ. 60 కోట్ల డీఎంఎస్టీ నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే తాండూరులో ఐటీఐ కళాశాల తీసువకచ్చేందుకు కృషి’ చె యడం జరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి సమగ్రంగా జరగలేదని చెప్పుకొచ్చారు. రాబోవు రోజుల్లో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చి తీరుస్తామన్నారు.

మైమ‌రించిన మువ్వ‌న్నెల ప్ర‌ద‌ర్శ‌న‌లు
ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన సామూహిక స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు మైమ‌రిపించాన్నాయి.

ముఖ్యంగా పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు దేశంలోని 29 రాష్ట్రాల ప్రత్యేకతలు, భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమైక్యతను చాటుతూ చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. అదేవిధంగా శ్రీ కృష్ణవేణి టాలెంట్, గంగోత్రి స్కూల్ విద్యార్థులతో పాటు సింధు బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు కూడ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు విజయదేవి, వసంత, ఆసిఫ్, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి రాజుగౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రంగారావు, తాండూరు మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, పట్టణ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, కోఆప్షన్ సభ్యులు, విద్యాధికారి వెంకటయ్య గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.