పదేళ్ల నీరీక్షణకు మోక్షం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పదేళ్ల నీరీక్షణకు మోక్షం..!
– రూ. 49కోట్లతో తాండూరు – హైదరాబాద్‌ రోడ్డు
– ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– డబుల్‌ రోడ్డుగా విస్తరణకు శ్రీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రజలు దాదాపు పదేళ్లుగా నీరీక్షిస్తున్న తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనులకు మోక్షం కలిగింది. రూ. 49.78 కోట్లతో రోడ్డు పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్డు పనులను ప్రారంభించారు. పెద్దేముల్ మండలం మదనంతాపూర్సమీపంలో తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు.

గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు – హైదరాబాద్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు సకాలంలో చేపట్టలేదు. దీంతో తాండూరు – హైదరాబాద్ రోడ్డు మార్గంలో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను వేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 49.78 కోట్లతో ఆదివారం రోడ్డు పనులను ప్రారంభించారు. తాండూరు – హైదరాబాద్ రోడ్డు మార్గంలో డబుల్ రోడ్డుగా విస్తరించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో తాండూరు – హైదరాబాద్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, ముజీబ్ ఖాన్, గాజుల మాధవి, పెద్దేముల్ మండల నాయకులు, యువ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సం..!